తప్పు తెలుసుకున్న నెతన్యాహు.. క్షమాపణ లేఖ

by Muthe.Rajitha |

ఎట్టకేలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దిగివచ్చారు.

తప్పు తెలుసుకున్న నెతన్యాహు.. క్షమాపణ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దిగివచ్చారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహు తనను క్షమించాలని కోరుతూ అధ్యక్షుడు ఐజక్ హట్జాగ్‌కు అధికారికంగా విజ్ఞప్తి చేశారు. ప్రధాని కార్యాలయం క్షమాపణ కోరుతూ రాష్ట్రపతి కార్యాలయం న్యాయ విభాగానికి లేఖ సమర్పించగా.. అధ్యక్ష కార్యాలయం దీనిని అసాధారణ అభ్యర్థనగా పేర్కొంటూ ఇది అనేక చిక్కులతో ముడిపడి ఉందని తెలిపింది. నెతన్యాహు మూడు వేర్వేరు కేసుల్లో మోసం, నమ్మకద్రోహం, లంచాలు స్వీకరించడం వంటి అభియోగాలు ఎదుర్కొంటూ ఇజ్రాయెల్ చరిత్రలో విచారణకు హాజరైన ఏకైక ప్రధాన మంత్రిగా నిలిచారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన మొదటినుంచి ఖండిస్తూ వస్తున్నారు. నెతన్యాహు తన లేఖలో.. తనపై విచారణ విషయంలో దేశం ముక్కలుగా విడిపోయిందని, క్షమాభిక్ష ప్రసాదిస్తే దేశ ఐక్యత పునరుద్ధరణకు తోడ్పడతానని, వారానికి మూడుసార్లు కోర్టుకు హాజరు కావాలనే నిబంధన దేశ వ్యవహారాల నిర్వహణలో ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్నారు. కాగా నెతన్యాహు అభ్యర్థనను తొలుత న్యాయశాఖకు అభిప్రాయం కోసం పంపి, అక్కడి నుంచి అధ్యక్ష కార్యాలయంలోని న్యాయ సలహాదారుకు బదిలీ చేసి, అనంతరం అధ్యక్షుడి వద్దకు చేరుస్తారు.

Next Story