Nethanyahu: హమాస్‌ను పూర్తిగా అంతం చేస్తాం.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్

by B.Srinivas |

గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Nethanyahu: హమాస్‌ను పూర్తిగా అంతం చేస్తాం.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి హమాస్ సైతం అంగీకరింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin nethanyahu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థ హమాస్‌ను పునాదులతో సహా అంతం చేస్తామని హెచ్చరించారు. యుద్ధం అనంతరం గాజాలో హమాస్ ఉండబోదని తెలిపారు. హమాస్ ను పూర్తిగా నిర్మూలించి, బందీలందరినీ విడుదల చేస్తామని దీమా వ్యక్తం చేశారు.

కాగా, అమెరికా మద్దతుతో కూడిన కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చలకు ముందు హమాస్ తన వైఖరిని వెల్లడించింది. సీజ్ ఫైర్‌కు సిద్ధంగా ఉన్నామని, అయితే యుద్ధం శాశ్వత ముగింపునకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ క్రమంలోనే నెతన్యాహు పై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story