Operation Sindoor: మా జోలికి వస్తే ఊరుకోం.. పాకిస్థాన్‌కు నేపాల్ వార్నింగ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-09 12:28:30  IST  )

ప్రపంచదేశాలన్నీ ఇరు దేశాలు శాంతిని అనుసరించాలని కోరుతున్న క్రమంలో.. పాకిస్థాన్ పొరుగు దేశమైన నేపాల్ సీరియస్ వార్నింగ్ (Nepal Warning to Pak) ఇచ్చింది. భారత్‌పై దాడి చేసేందుకు తమ భూభాగాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించింది.

Operation Sindoor: మా జోలికి వస్తే ఊరుకోం.. పాకిస్థాన్‌కు నేపాల్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్‌లో (Pahalgam Terror Attack) హిందువులే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడి చేసి.. భర్తలను మాత్రమే హతమార్చిన ఘాతుకంపై భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)తో ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. కేవలం ఉగ్రస్థావరాలపైనే వైమానిక దాడులు చేసింది. ఉగ్రవాదులను చంపినందుకు పాక్ ఆర్మీ రియాక్ట్ అయి భారత్‌పై ప్రతిదాడులకు దిగింది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధం అనివార్యమైంది. ప్రపంచదేశాలన్నీ ఇరు దేశాలు శాంతిని అనుసరించాలని కోరుతున్న క్రమంలో.. పాకిస్థాన్ పొరుగు దేశమైన నేపాల్ సీరియస్ వార్నింగ్ (Nepal Warning to Pak) ఇచ్చింది. భారత్‌పై దాడి చేసేందుకు తమ భూభాగాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించింది.

ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్‌కు సపోర్ట్‌గా ఉంటామని.. నేపాల్ విదేశాంగ మంత్రిత్వశాఖ కీలక ప్రకటన ద్వారా వెల్లడించింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో నేపాల్‌కు చెందిన పౌరుడు కూడా మరణించడంతో నేపాల్ ఈ దాడిని ఖండించింది. ఉగ్రదాడులతో, తుపాకుల కాల్పులతో దద్దరిల్లుతోన్న భారత్ సరిహద్దు ప్రాంతం త్వరలోనే ప్రశాంతంగా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

Next Story