Nepal: ఖాట్మండులో కర్ఫ్యూ ఎత్తివేత.. నేపాల్‌లో సాధారణ పరిస్థితులు

by B.Srinivas |

ఐదు రోజులుగా జెజ్ జీ ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

Nepal: ఖాట్మండులో కర్ఫ్యూ ఎత్తివేత..  నేపాల్‌లో సాధారణ పరిస్థితులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐదు రోజులుగా జెజ్ జీ ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని ఖాట్మండ్ సహా ఇతర ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను సైన్యం ఎత్తి వేసింది. దీంతో రోజుల తరబడి మూసివేత తర్వాత దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, షాపింగ్ మాల్స్ తిరిగి తెరిచారు. వీధుల్లోనూ ట్రాఫిక్ రద్దీ ప్రారంభమైంది. నిరసనల టైంలో ధ్వంసమైన ప్రభుత్వ భవనాలు సహా అనేక ప్రదేశాల్లో పారిశుధ్య కార్యక్రమాలు షురూ అయ్యాయి. శనివారం ఎటువంటి నియంత్రణ, కర్ఫ్యూ ఉత్తర్వులు అమల్లో లేవని నేపాల్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలు స్వీకరించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు సుశీల కర్కికి దలైలామా అభినందనలు తెలిపారు.

కాగా, ప్రభుత్వ అవినీతి, సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా జెన్ జీ యువత ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు పార్లమెంట్, సుప్రీంకోర్టుకు నిప్పుపెట్టారు. దేశ మంత్రులు, మాజీ ప్రధానుల ఇండ్లపై దాడికి పాల్పడ్డారు. పోలీసులకాల్పుల్లో సుమారు 51 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రిజైన్ చేశారు. అనంతరం నేపాల్ సైన్యం భద్రతా పరిస్థితిని తమ ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా పరిస్థితి అదుపులోకి రావడంతో కర్ఫ్యూ ఎత్తేసింది.

Next Story