Neet ug: నీట్ పరీక్షపై తప్పుడు సమాచారం..120 సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ !

by B.Srinivas |

ఈ నెల 4వ తేదీన నీట్ యూజీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై దృష్టి పెట్టింది.

Neet ug: నీట్ పరీక్షపై తప్పుడు సమాచారం..120 సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 4వ తేదీన నీట్ యూజీ (Neet Ug) పరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పరీక్షపై పుకార్లు వ్యాప్తి చేస్తున్న 120కి పైగా సోషల్ మీడియా (Social media) ఖాతాలను గుర్తించింది. వాటిలో 106 టెలిగ్రామ్ (Telegram) చానెల్స్, 16 ఇన్ స్టాగ్రామ్(Instagram) అకౌంట్లు ఉన్నాయి. ఈ ఖాతాలు అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించింది. ప్రశ్నాపత్రాల లీకేజీలకు సంబంధించిన వివరాలనూ షేర్ చేస్తున్నాయని తెలిపింది. ఈ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ సంస్థలకు ఎన్టీఏ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక ఈ ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తుల వివరాలను కూడా అందించాలని కోరింది.

తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఈ కేసులను హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వద్ద కేసులు దాఖలు చేసినట్టు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ నెల 26న పరీక్షలపై ఏమైనా ఫిర్యాదులుంటే తెలియజేయాలని ఎన్టీఏ ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకు 1500 కంటే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్టీఏ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Next Story