- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ యూజీ-2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్ (NEET UG 2025 Counselling 2025) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్ (NEET UG 2025 Counselling 2025) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. కౌన్సెలింగ్ ద్వారా దేశంలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. mcc.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నీట్ యూజీ -2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తోంది. జులై 28 వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
కాగా.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 1.3 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. 1 లక్ష ఎంబీబీఎస్ సీట్లు, 28 వేల బీడీఎస్ సీట్లు ఉన్నాయన్నారు. 775 విద్యాసంస్థలు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. మూడు సాధారణ రౌండ్లు, ఒక స్ట్రే వాకెన్సీ రౌండ్ తో విద్యార్థులు రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, సీటు కేటాయింపు, రిపోర్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ నీట్ యూజీ 2025 ర్యాంక్, సీట్ల లభ్యత, చాయిస్ ఫిల్లింగ్ ఆధారంగా సీట్లను పొందుతారు. విద్యార్థులకు కేటాయించిన కోర్సులు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.






