NEET UG 2026: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల

by Kema Shiva Kumar |

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ -2026కు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.

NEET UG 2026: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోరుకునే లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న NEET UG 2026 అడ్మిట్ కార్డ్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసేందుకు సిద్ధమైంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లేదా exams.nta.ac.in/NEET ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు మే 3 దేశవ్యాప్తంగా పెన్-అండ్-పేపర్ మోడ్‌లో పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు పరీక్ష కొనసాగనుంది. అదేవిధంగా డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థుల పేరు, ఫోటో, పరీక్ష కేంద్రం చిరునామా, సంతకం సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని అధికారులు సూచించారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే ఎన్‌టీఏ (NTA) హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Next Story