Neet pg: నీట్ పీజీ ఫీజులు కౌన్సిలింగ్ కంటే ముందే వెల్లడించాలి.. సుప్రీంకోర్టు

by B.Srinivas |

నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు ముందే విశ్వ విద్యాలయాలు తమ ఫీజు వివరాలను బహిర్గతతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Neet pg: నీట్ పీజీ ఫీజులు కౌన్సిలింగ్ కంటే ముందే వెల్లడించాలి.. సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పీజీ (Neet pg) కౌన్సెలింగ్‌కు ముందే అన్ని ప్రయివేట్, డీమ్డ్ విశ్వ విద్యాలయాలు తమ ఫీజు వివరాలను బహిర్గతతం చేయాలని సుప్రీంకోర్టు (Supreme court) ఆదేశాలు జారీ చేసింది. నీట్ పీజీలో పారదర్శకతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. భారీగా పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. సీట్ల బ్లాకింగ్‌లో అక్రమాలను నివారించడానికి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కౌన్సిలింగ్ టైంలో సీట్లు బ్లాక్ చేస్తే జరిమానా విధించాలని సూచించింది. కౌన్సెలింగ్ సమయంలో సీట్లను బ్లాక్ చేయడం వల్ల అత్యున్నత ర్యాంకు సాధించిన అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడింది.

దీని వల్ల మెరిట్ ఆధారిత ఎంపిక సైతం దెబ్బతింటుందని తెలిపింది. ఏ విద్యార్థి అయినా ఇలా చేస్తే వారిని తదుపరి నీట్ పీజీ పరీక్షకు అనర్హులుగా ప్రకటించాలని పేర్కొంది. అంతేగాక సీటు బ్లాకింగ్‌కు పాల్పడితే సెక్యూరిటీ డిపాజిట్ జప్తు, కాంప్లికేటెడ్ కాలేజీలను బ్లాక్‌లిస్ట్ చేయడం వంటి కఠినమైన జరిమానాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర స్థాయిలో సమలేఖనం చేయడానికి కి జాతీయ స్థాయి కౌన్సెలింగ్ క్యాలెండర్ అమలు చేయాలని తెలిపింది.

Next Story