- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 17 రోజుల్లోనే మూడోది
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగట్లేదు. ఒడిశాకు చెందిన పద్దెనిమిదేళ్ల విద్యార్థి విజ్ఞాన్ నగర్ లోని హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగట్లేదు. ఒడిశాకు చెందిన పద్దెనిమిదేళ్ల విద్యార్థి విజ్ఞాన్ నగర్ లోని హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు. మృతుడు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) ప్రవేశ పరీక్ష కోసం కోటాలో కోచింగ్ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు వచ్చిన తర్వాతే పోస్ట్ మార్టం నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. అప్పటివరకు హాస్పిటల్ మార్చురీలో డెడ్ బాడీని భద్రపరుస్తామన్నారు.
17 రోజుల్లో మూడో కేసు
కోటాలో కేవలం 17 రోజుల్లో ఇది మూడో కేసు. గత వారం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE)కి సిద్ధమవుతున్న ఇద్దరు విద్యార్థులు తమ హాస్టల్స్ లో ఆత్మహత్య చేసుకున్నారు. జనవరి7 న మధ్యప్రదేశ్ నివాసి, జనవరి 8న హర్యానాకు చెందిన విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 2023లో 29 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్యలు చేసుకోగా.. 2024లో 19 మంది సూసైడ్ చేసుకున్నారు. కోటా జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది ఆత్మహత్యలు తగ్గినట్లు తెలుస్తోంది.






