వీడిన సస్పెన్స్.. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ మాజీ గవర్నర్

by Malleboina Mahesh |   (  Updated:2025-08-17 14:52:22  IST  )

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్న సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించారు.

వీడిన సస్పెన్స్.. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ మాజీ గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి (Vice Presidential Candidate) ఎంపికపై సస్పెన్స్ వీడింది. ఈ రోజు ఢిల్లీలోనీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరి సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధా కృష్ణన్ (CP Radhakrishnan) ప్రకటించారు. తమిళనాడుకు చెందిన ఆయన గతంలో కోయంబత్తూర్ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రాధా కృష్ణన్ గతంలొ తెలంగాణ గవర్నర్‌గా కూడా భాత్యతలు నిర్వహించారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇదిలా ఉంటే పార్లమెంటరీ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) అధికారికంగా.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధా కృష్ణన్ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీ రాధాకృష్ణన్ ఒక రాజనీతిజ్ఞుడు, తమిళనాడులోని అన్ని వర్గాల వారు ఆయనను గౌరవిస్తారని నడ్డా చెప్పుకొచ్చారు.

Next Story