ఢిల్లీ పార్లమెంట్‌లో ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం

by Malleboina Mahesh |

పార్లమెంట్ లోని లైబ్రరీ భవనంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

ఢిల్లీ పార్లమెంట్‌లో ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి (NDA alliance)లోని ప్రధాన పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన అపూర్వ విజయం పై ప్రధాని మోదీకి ఎన్డీయే నేతలు ఘన సన్మానం చేశారు. ఎవరు ఊహించని స్థాయిలో అద్భుతమైన విజయం పట్ల ఎన్డీయే ఎంపీలు, నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఘనంగా సన్మానించారు. లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన ఎన్డీయే సభ్యులు హాజరైన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి కీలక నాయకులు పాల్గొని మోడీ నాయకత్వాన్ని అభినందించారు. ఇదిలా ఉంటే ఈ రోజు లోక్ సభలో అత్యంత కీలకమైన ఎస్ఐఆర్ పై 10 గంటల పాటు చర్చ జరగనుంది. ఇందులో భాగంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ SIRపై చర్చను ప్రారంభించనున్నారు. దీంతో ఇండియా కూటమి నేతలు మొత్తం సభకు హాజరు కావాలని అన్ని పార్టీలు తమ ఎంపీలకు సందేశాలు పంపారు. అలాగే వందేమాతరం పై రాజ్యసభలో చర్చ జరగనుంది.

Next Story