- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: ప్రజా సంక్షేమానికే ఎన్డీఏ కట్టుబడి ఉంది- మోడీ
ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత దశాబ్దంలో అనేక మందికి పేదరికం నుంచి విముక్తి పొందేందుకు కృషిచేశామన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత దశాబ్దంలో అనేక మందికి పేదరికం నుంచి విముక్తి పొందేందుకు కృషిచేశామన్నారు. దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు శ్రమించామన్నారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొన్నట్లు ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రతిఒక్కరూ గౌరవంగా జీవించడానికి వీలుగా.. సమ్మిళిత, స్వయంసమృద్ధి భారత్‌ను తయారుచేసేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తాము ప్రవేశపెట్టిన అన్ని పథకాలు పేదల జీవితాలను మార్చాయన్నారు. జూన్ 9 నాటికి కేంద్రంలో మోడీ 3.0 సర్కారు ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. ఈసందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన మంత్రివర్గ సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించుకొని.. వాటిని సాధించేందుకు ఉత్సాహంగా పనిచేయాలని సహచరులకు సూచించారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
ప్రభుత్వ పథకాలపై..
ఇకపోతే, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మోడీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, జన్‌ధన్, ఆయుష్మాన్ భారత్ వంటివి ప్రజలకు ఇళ్లు, ఇంధనం, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించాయి. 25 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారు’’ అని మోడీ పేర్కొన్నారు. ఇకపోతే, వరుసగా మూడోసారి మోడీ సర్కారు కేంద్రంలో కొలువుదీరింది. మోడీ ప్రభుత్వం 3.0 ఏర్పడి జూన్ 9 నాటికి ఏడాది పూర్తికానుంది. దీంతో ఆయన 11 ఏళ్లపాటు ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా మారారు.






