NDA: బిహార్‌లో ఎన్డీయేకు భారీ షాక్.. కీలక అభ్యర్థి నామినేషన్ రద్దు !

by B.Srinivas |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు భారీ షాక్ తగిలింది. మధుర నుంచి బరిలోకి దిగిన సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది.

NDA: బిహార్‌లో ఎన్డీయేకు భారీ షాక్.. కీలక అభ్యర్థి నామినేషన్ రద్దు !
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు భారీ షాక్ తగిలింది. మధుర నియోజకవర్గం నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నుంచి బరిలోకి దిగిన సీమా సింగ్ (Seema singh) నామినేషన్ తిరస్కరణకు గురైంది. రిటర్నింగ్ ఆఫీసర్లకు ఆమె దాఖలు చేసిన పత్రాల్లో తేడాలున్నందున అధికారులు నామినేషన్ రద్దు చేశారు. నామినేషన్ ఫారంతో పాటు అవసరమైన పత్రాలను సీమా సమర్పించలేదని తెలుస్తోంది. దీంతో ఎలక్షన్స్‌కు ముందే ఎన్డీయే కూటమికి భారీ ఎదురుదెబ్బ తాకినట్టు అయింది. మొదటి విడత నామినేషన్ శుక్రవారంతో ముగియగి చివరి రోజు సీమా సింగ్ నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే నామినేషన్ పత్రాలను పరిశీలించిన అధికారులు రద్దు చేశారు.

సీమా సింగ్ బోజ్ పురి చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి. ఇటీవలే ఆమె ఎల్జేపీలో చేరగా చిరాగ్ పాశ్వాన్ ఆమెకు మధుర నుంచి టికెట్ కేటాయించారు. ఎన్డీయే అభ్యర్థి తప్పుకోవడంతో ఆ స్థానంలో ప్రధాన పోటీ ఆర్జేడీ, జన్ సూరజ్ పార్టీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి దశ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా రెండో దశకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

Next Story