- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసును సుమోటోగా స్వీకరించిన NCSC
హరియాణలో ఐపీఎస్ అధికారి వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: హరియాణలో ఐపీఎస్ అధికారి (IPS officer) వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య (Puran Kumar suicide) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 7న ఛండీగఢ్‌లోని తన నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన రాసిన 8 పేజీల సూసైడ్ నోట్ (Suicide note)ను పోలీసులు స్వాదినం చేసుకున్నారు. డీజీపీ, ఏడీజీపీ, ఎస్పీ ర్యాంకులకు చెందిన 10 మంది సీనియర్ అధికారులు మానసిక వేధింపులకు గురిచేశారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఐపీఎస్ అధికారి తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. దళిత ఐపీఎస్ అధికారి వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసును జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) సుమోటోగా స్వీకరించింది.
అలాగే చండీగఢ్ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) లకు నోటీసులు జారీ చేసింది. అందులో ఐపీఎస్ అధికారి వై.పురాణ్ కుమార్ ఆత్మహత్యపై తీసుకున్న చర్యలపై ఏడు రోజుల్లోగా నివేదికను సమర్పించాలని NCSC ఆదేశించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ద్వారా తనకు ఇవ్వబడిన అధికారాల ప్రకారం ఈ విషయంపై విచారణ నిర్వహిస్తామని కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. నిందితులందరికీ పేర్లు, FIR నంబర్, తేదీ, సంబంధిత విభాగాలు, అలాగే అరెస్టుల స్థితి, బాధితుడి కుటుంబానికి అందించబడిన ఏదైనా పరిహారం వంటి వివరణాత్మక సమాచారాన్ని NCSC కోరింది.






