అజిత్ పవార్ సీఎం కావడం ఖాయం.. ఎంపీ ప్రఫుల్ పటేల్

by Dishafeatures2 |
అజిత్ పవార్ సీఎం కావడం ఖాయం.. ఎంపీ ప్రఫుల్ పటేల్
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్సీపీ (అజిత్ పవార్ కూటమి) రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ మహారాష్ట్రకు కాబోయే సీఎం అన్నారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం పోస్టు ఖాళీగా లేదని, కానీ ఏదో ఒక రోజు ఆయన సీఎం అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అజిత్ పవార్ చాలా సీనియర్ నేత అని, ఎన్నో ఏళ్లుగా ఎన్సీపీని ముందుండి నడిపిస్తున్నారని అన్నారు.

కాగా అజిత్ పవార్ ఆగస్టు 10 నాటికి మహారాష్ట్ర సీఎం అవుతారని కాంగ్రెస్ నేత పృథ్విరాజ్ చవాన్ ఇటీవల అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను అక్కడి డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఖండించారు. సీఎం మార్పు ఉండదని, సీఎంగా షిండేనే కొనసాగుతారని స్పష్టం చేశారు. అయితే ప్రఫుల్ పటేల్ తాజా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.


Next Story

Most Viewed