- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani Cement: అదానీ సిమెంటేషన్‌ను అంబుజా సిమెంట్స్‌తో విలీనం చేయడానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం
ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అదానీ సిమెంటేషన్‌ను అంబుజా సిమెంట్స్‌తో విలీనం చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆమోదంతో అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారాన్ని ఒకే యూనిట్ కింద ఏకీకృతం చేయడంతో పాటు సంయుక్త ప్రయోజనాలకు సహాయపడుతుంది. విలీనం తర్వాత కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతో పాటు లక్జెంబర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జారీ చేసిన అన్ని నిబంధనలు, సర్క్యులర్లు, ఆదేశాలను పాటించాలని ఎన్‌సీఎల్‌టీ అంబుజా సిమెంట్‌కు ఆదేశించింది. అలాగే ట్రాన్స్‌ఫర్ కంపెనీ(అదానీ సిమెంటేషన్)కు చెందిన అన్ని ఆస్తి హక్కులు, అధికారాలు, ఇతర ఆస్తి హక్కులు అంబుజా సిమెంట్‌కు చట్టం, దస్తావేజు లేకుండా బదిలీ అవుతాయని వివరించింది. 2024, జూన్‌లో బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తన సిమెంట్ ఆస్తుల విలీనం, యాజమాన్య పునర్నిర్మాణాన్ని ప్రకటించింది. ఇవి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్ మరియు అదానీ సిమెంటేషన్ కింద కొనసాగుతాయి. తద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్ అంబుజా సిమెంట్స్‌లో 87 లక్షల షేర్లను పొందుతుంది. కాగా, అదానీ గ్రూప్ సంవత్సరానికి 100 మిలియన్ టన్నులకు పైగా (ఎంటీపీఏ) సామర్థ్యంతో దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా ఉంది.






