- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ncert: దేశ విభజనకు ఆ ముగ్గురే కారణం.. ఎన్సీఈఆర్టీ మాడ్యూల్‌పై దుమారం !
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) విద్యార్థులు కోసం ఓ ప్రత్యేక మాడ్యూల్ విడుదల చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) విద్యార్థులు కోసం ఓ ప్రత్యేక మాడ్యూల్ విడుదల చేసింది. దేశ విభజనకు సంబంధించిన పరిణామాలను ఇందులో వివరించింది. భారతదేశ విభజనకు ముగ్గురు వ్యక్తులను బాధ్యులుగా పేర్కొంది. ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నా, కాంగ్రెస్ పార్టీ, వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్‌ల వల్లే దేశం విడిపోయిందని తెలిపింది. జిన్నా ఈ ప్రతిపాదన చేయగా కాంగ్రెస్ దానికి అంగీకరించిందని, మౌంట్ బాటన్ దీనిని అమలు చేశారని తెలిపింది. దీని వల్లే కశ్మీర్ సమస్య తలెత్తిందని, దేశానికి కొత్త భద్రతా సమస్యగా మార్చిందని పేర్కొంది. అప్పటి నుంచి పాక్ వివిధ మార్గాల్లో భారత్ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని వెల్లడించింది. ఈ మాడ్యూల్‌కు విభజన నేరస్థులు అనే శీర్షిక పెట్టగా దీనిని 6 నుంచి 8, 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం తయారు చేశారు. అయితే సాధారణ పాఠ్య పుస్తకాలకు అదనంగా దీనిని రూపొందించారు.
దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా స్పందిస్తూ.. ఈ పత్రాన్ని చింపేయాలని ఎందుకంటే ఇది పూర్తి అబద్ధంగా ఉందని తెలిపారు. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ మధ్య ఉన్న సంబంధం కారణంగానే విభజన జరిగిందని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ఈ దేశానికి ప్రమాదకరమని, విభజన ఆలోచనను మొదట హిందూ మహాసభ 1938లో ప్రచారం చేసిందన్నారు. 1940లో జిన్నా కూడా దీనిని పునరావృతం చేశాడని తెలిపారు.






