- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవోదయలో విద్యార్థులకు ప్రవేశాలు.. ఇంకా మూడ్రోజులే గడువు
by Naga Rani Yarlagadda |
దేశవ్యాప్తంగా 654 జేఎన్వీల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి రెండు విడతలలో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జవహర్ నవోదయ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ దరఖాస్తుల గడువును తాజాగా పొడిగించగా.. ఆ గడువు మరో మూడ్రోజుల్లో పూర్తికానుంది. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.
దేశవ్యాప్తంగా 654 జేఎన్వీల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి రెండు విడతలలో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13న, జమ్ముకశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ జరగనుంది. దీనిపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 13 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఒక్కో స్కూల్లో సుమారు 80 మంది ఆరవ తరగతి ప్రవేశం పొందవచ్చు.
Next Story






