- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరగాడిగా మారిన జాతీయ షూటర్.. రూ. 40 లక్షల ఫ్రాడ్ కేసులో అరెస్ట్
నిందితుడు హిమాంశు చౌహాన్ సాధారణ వ్యక్తి కాదు. జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొని వెండి, కాంస్య పతకాలను సాధించాడు. అంతేకాకుండా, స్టేట్ లెవల్ ఛాంపియన్‌షిప్‌లలో 50 మీటర్లు, 300 మీటర్ల రైఫిల్ ఈవెంట్లలో స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు. ఒక ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా సమాజంలో ఉన్న గుర్తింపును, నెట్‌వర్క్‌ను అతను సైబర్ నేరాలకు మళ్లించడం గమనార్హం.

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ ఆర్థిక నేరాలపై ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ విభాగం భారీ విజయాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా సాగుతున్న అత్యాధునిక మల్టీ-లేయర్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్‌లో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్న ఒక జాతీయ స్థాయి షూటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన హిమాన్షు చౌహాన్ అలియాస్ షూటర్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. నార్త్-వెస్ట్ ఢిల్లీ సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ (E-FIR No. 60000101/2025) ఆధారంగా ఈ అరెస్ట్ జరిగింది. బాధితుడి నుండి సుమారు రూ. రూ. 40.27 లక్షలు కేటుగాళ్లు కాజేశారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ బృందం, ఈ మోసం వెనుక హిమాన్షు చౌహాన్ కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారించింది.
పతకాల విజేత.. నేరాల్లో భాగస్వామి!
పోలీసుల వెల్లడించిన వివరాలు.. నిందితుడు హిమాన్షు చౌహాన్ సాధారణ వ్యక్తి కాదు. జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొని వెండి, కాంస్య పతకాలను సాధించాడు. అంతేకాకుండా, స్టేట్ లెవల్ ఛాంపియన్‌షిప్‌లలో 50 మీటర్లు, 300 మీటర్ల రైఫిల్ ఈవెంట్లలో స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు. ఒక ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా సమాజంలో ఉన్న గుర్తింపును, నెట్‌వర్క్‌ను అతను సైబర్ నేరాలకు మళ్లించడం గమనార్హం. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 318(4), 319(2), 61(2), 3(5) కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు తనకున్న పలుకుబడిని ఉపయోగించి సైబర్ మోసాలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో పాటు, పెద్ద ఎత్తున సాగుతున్న ఈ సిండికేట్‌లో ఆపరేటివ్‌గా వ్యవహరించాడు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్రీడల్లో దేశానికి కీర్తి తేవాల్సిన వ్యక్తి, ఇలా సైబర్ నేరాల బాట పట్టి పట్టుబడటం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది.






