- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
National Security: ఎన్ఎస్ఏబీ చైర్మన్‌గా అలోక్ జోషి.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు (ఎన్ఎస్ఏబీ)ని పునర్వ్యస్థీకరించింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ( RAW) మాజీ చీఫ్ అలోక్ జోషి (Alok joshi) ని కొత్త చైర్మన్‌గా నియమించింది. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అధ్యక్షతన బుధవారం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCA) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరో ఆరుగురు సభ్యులను కూడా బోర్డులో చేర్చారు. వీరిలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారులు ఉన్నారు.
బోర్డు సభ్యుల్లో రిటైర్డ్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా (Pm Sinha), రిటైర్డ్ లెఫ్ట్ నెంట్ జనరల్ ఏకే సింగ్ (Ak singh), మాజీ నావికాదళ అధికారి మాంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్ ఆపీసర్ రాజీవ్ రంజన్, మన్మోహన్ సింగ్ లు ఉన్నారు. పహల్గాం దాడి నేపథ్యంలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఎన్ఎస్ఏబీని1998లో ఏర్పాటు చేశారు. ముఖ్యమైన అంశాలపై జాతీయ భద్రతా మండలికి (NSC)కి ఇది సలహాలిస్తుంది.






