- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ బాలల పురస్కారాలు.. వ్యోమప్రియ సాహసం, శ్వాన్ సింగ్ ఉదారత
అసమాన ధైర్య సాహసాలు, స్పోర్ట్స్, ఆర్ట్స్, సైన్స్ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన 5-18 ఏళ్ల చిన్నారులను గౌరవించేందుకు ప్రతి ఏడాది డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ సందర్భంగా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ను అందజేస్తారు.

దిశ, వెబ్ డెస్క్ : అసమాన ధైర్య సాహసాలు, స్పోర్ట్స్, ఆర్ట్స్, సైన్స్ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన 5-18 ఏళ్ల చిన్నారులను గౌరవించేందుకు ప్రతి ఏడాది డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ సందర్భంగా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ను అందజేస్తారు. ఈ ఏడాది రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీతో పాటు పలువురు చిన్నారులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కార గ్రహీతల్లో ప్రతి ఒక్కరిదీ ప్రత్యేక కథగా నిలిచింది. కరెంట్ షాక్ నుంచి మరో బాలుడిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన ఎనిమిదేళ్ల వ్యోమప్రియ తరఫున ఆమె తల్లి అర్చనా శివరామకృష్ణన్ భావోద్వేగంగా అవార్డు స్వీకరించారు.
2024 మేలో తమిళనాడులోని కోయంబత్తూరులో పిల్లల పార్క్‌లో జరిగిన ఈ ఘటన దేశాన్ని కలచివేసింది. అలాగే ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనికులకు స్వచ్ఛందంగా నీరు, పాలు, టీ, లస్సీ అందిస్తూ సేవ చేసిన పంజాబ్ ఫిరోజ్‌పుర్ జిల్లాకు చెందిన పదేళ్ల శ్వాన్ సింగ్ ఉదారత దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ ధైర్యసాహసాలు, మానవతా విలువలకు గుర్తింపుగా అతడికీ బాల్ పురస్కార్ లభించింది.






