- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sunita Williams: నాసా మిషన్ వాయిదా.. సునీతా విలియమ్స్ రాక ఆలస్యం
Sunita Williams: మూడవసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) దాదాపు 9నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.

దిశ, వెబ్ డెస్క్: Sunita Williams: మూడవసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) దాదాపు 9నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఆమెతోపాటు వెళ్లిన బచ్ విల్మోర్(Wilmore) కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారిని భూమి పైకి తీసుకువచ్చేందుకు నాసా(NASA) -స్పేస్ ఎక్స్(SpaceX) లు ప్రయోగించిన క్రూ 10 (Crew-10)మిషన్ మరోసారి వాయిదా పడింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10(Crew-10) మిషన్ సిద్ధం అయ్యింది. అయితే అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమ గాముల రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
జూన్ 5, 2024న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో వారు ఐఎస్ఎస్(ISS) కు చేరిన సంగతి తెలిసిందే. ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్ లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లు వారం రోజులకే భూమిని చేరాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరింది. సునీతా విలియమ్స్(Sunita Williams) , విల్మోర్(Wilmore) అప్పటినుంచి ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది.
ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఐఎస్ కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు తెలిపారు. ఇక సునీత విలియమ్స్, విల్మోర్ కొన్ని రోజుల క్రితం స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. తమ కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్(SpaceX) కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక రానుందని..నౌకలో కొత్తగా ఐఎస్ఎస్ లోకి వచ్చ వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని తెలిపారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు చేరుకుంటామని తెలిపారు.
క్రూ-10(Crew-10) మిషన్‌కు నాసాకు చెందిన అన్నే మెక్‌క్లెయిన్ నాయకత్వం వహిస్తుండగా, నికోల్ అయర్స్ పైలట్‌గా వ్యవహరిస్తారు. ఈ మిషన్‌లో జపాన్ అంతరిక్ష సంస్థ JAXAకి చెందిన టకుయా ఒనిషి, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన కిరిల్ పెస్కోవ్ కూడా ఉన్నారు. అయర్స్, పెస్కోవ్ మొదటిసారి అంతరిక్షంలోకి ప్రయాణించనున్నారు. అయితే మెక్‌క్లెయిన్, ఒనిషికి ఇది రెండవ మిషన్ అవుతుంది.
క్రూ-10 (Crew-10)స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ఇద్దరు సిబ్బంది కొన్ని రోజుల పాటు ISSలో కలిసి ఉంటారు. తరువాత, విలియమ్స్, విల్మోర్ నాసా వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో తిరుగు ప్రయాణం చేస్తారు. అయితే, ఫ్లోరిడా తీరంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల వారు తిరిగి రావడం మరింత ఆలస్యం కావచ్చు.స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ గతంలో తన కంపెనీ గత సంవత్సరం వ్యోమగాములను తిరిగి తీసుకురాగలదని పేర్కొన్నాడు. కానీ బిడెన్ పరిపాలన దానిని నిరోధించినట్లు తెలిసింది. అయితే, విల్మోర్ ఆ వాదనను అంగీకరించాడు. తనకు దాని గురించి పూర్తి జ్ఞానం లేదని చెప్పాడు. ఈ ఆరోపణలపై నాసా ఎటువంటి అధికారిక వ్యాఖ్య చేయలేదు.






