‘నో డ్రోన్ జోన్‌’గా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్.. ఎందుకు ? ఎప్పటివరకు ?

by Dishanational4 |
‘నో డ్రోన్ జోన్‌’గా  ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్.. ఎందుకు ? ఎప్పటివరకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని నో డ్రోన్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. దానికి ముప్పు పొంచి ఉన్నందున మార్చి 28 వరకు ఈ కార్యాలయం ప్రాంగణంలోని ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 144 (1) (3) కింద ఆదివారం ఈమేరకు ఒక ఉత్తర్వును పోలీసులు జారీ చేశారు. దాని ప్రకారం.. ‘‘హోటళ్లు, లాడ్జీలు, కోచింగ్ సెంటర్లతో కూడిన అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రదేశంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది. అందువల్ల ఆయాచోట్లకు రాకపోకలు సాగించేవారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఫొటోలు, వీడియోలు తీయడం ఈజీ అవుతుంది. డ్రోన్ వీడియోగ్రఫీని కూడా కొందరు వాడుకునే రిస్క్ ఉంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ముప్పు పొంచి ఉన్నందున జనవరి 29 నుంచి మార్చి 28 వరకు ఎవరు కూడా దాని ఫొటోలు, వీడియోలు తీయకూడదు. ఒకవేళ ఫొటోలు, వీడియోలు తీస్తే ఆర్డర్‌ను ఉల్లంఘించిన వారిగా పరిగణించి ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్ నగరంలోని మహల్ ప్రాంతంలో ఉంది.


Next Story