నిద్రపోవడం లేదు.. ఆ పని చేస్తున్నా : నాగాలాండ్ మంత్రి ట్వీట్

by Dishafeatures2 |
నిద్రపోవడం లేదు.. ఆ పని చేస్తున్నా : నాగాలాండ్ మంత్రి ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: నాగాలాండ్ కు చెందిన మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ లో నిత్యం ఏదో ఒక ఆసక్తికర పోస్టు పెడుతూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటారు. తాజాగా టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ తనకు సంబంధించిన ఓ ఫన్నీ ఫోటో ను షేర్ చేశారు. ఆ ఫోటోలో తెల్లటి చొక్కా దానిపై నలుపు జాకెట్ లో కళ్లు మూసుకొని మొబైల్ ఫోన్ లో ఏదో నొక్కతున్నట్లు అలోంగ్ కనిపిస్తాడు. ఇక ఫోటోకు ‘‘ నేను నిద్రపోవడం లేదు.. ట్విట్టర్ మెసేజ్ ను కంపోజ్ చేస్తున్నా’’ అంటూ ఓ కామెంట్ తగిలించాడు.

ఇంకేముంది ఫోటో షేర్ చేసిన నిమిషాల్లోనే రెండున్నర లక్షలకు పైగా వ్యూస్, 12 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్స్ అయితే కుప్పలు కుప్పలుగా వచ్చి పడ్డాయి. ‘‘కళ్లు మూసుకుని ఏం టైప్ చేస్తున్నారు సార్’’ అంటూ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేయగా.. ట్వీట్ పెట్టాక మంత్రి గారు నిద్రపోయినట్లున్నారు అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. ‘నేను చిన్నప్పుడే చదవమంటే బుక్ ముందుకు పెట్టుకొని ఇలాగే నిద్రపోయేవాడినంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Next Story

Most Viewed