- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Nadda: యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా
Nadda: యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా
by B.Srinivas |
యువత ఆకస్మిక మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌తో సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభకు తెలిపారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: యువకుల ఆకస్మిక మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌తో సంబంధం లేదని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనంలో ఈ విషయం నిరూపితమైందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP nadda) మంగళవారం రాజ్యసభకు తెలిపారు. టీకాలు వేయడం వల్లే అటువంటి మరణాలు తగ్గుతాయని పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. గత ఏడాది మే-ఆగస్టు మధ్యకాలంలో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆస్పత్రుల్లో దీనిపై అధ్యయనం జరిగిందని తెలిపారు. మొత్తం 729 ఆకస్మిక మరణాలు, 2,916 కేసులను ఐసీఎంఆర్ విశ్లేషంచినట్టు వెల్లడించారు. కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్‌లను తీసుకోవడం వల్ల ఆకస్మిక మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని పరిశోధనలు వెల్లడించాయి. 19 రాష్ట్రాల్లో 18 నుంచి 45 ఏళ్ల వయసు గల వారిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసినట్టు తెలిపారు.
Next Story






