- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైసూర్‌పాక్ కాదు, మైసూర్‌శ్రీ.. ఆ స్వీట్ సృష్టికర్త మునిమనవడు తీవ్ర అభ్యంతరం
ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారతీయుల ఆగ్రహం తీవ్రమైంది.

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత పాకిస్థాన్‌పై భారతీయుల ఆగ్రహం తీవ్రమైంది. ఆ దేశం పేరును పలకాడానికి, వినడానికి కూడా ప్రజలు ఇష్టపడలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మైసూరుపాక్ (Mysorepak) స్వీట్ పేరులోంచి పాక్‌ను (Pak) తొలగించాలని పలు మీమ్స్ వెల్లువెత్తాయి. ఈ తరుణంలో రాజస్థాన్‌లోని జైపూర్‌లో (Jaipur) ఉన్న త్యోహార్ స్వీట్స్ యజమాని అంజలీ జైన్.. మైసూరుపాక్ పేరులోని పాక్ పదాన్ని తొలగించి, దాని స్థానంలో శ్రీ అని చేర్చారు. ఇది కాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై మైసూరుపాక్‌ను మొదట తయారు చేసిన రాయల్ కుక్ కకాసుర మడప్ప మునిమనవడు ఎస్.నటరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎస్.నటరాజ్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. మైసూరుపాక్ అనే పేరే మనదేశంలో ఫేమస్ అని, దాన్ని అలాగే పిలవాలని కోరారు. పూర్వీకులు అందించిన ఆవిష్కరణకు ఇంకో పేరు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. కన్నడ భాషలో పాక (Paaka) అంటే చక్కెర లేదా బెల్లంతో చేసే పదార్థం అని, తొలుత మైసూరులో తయారు చేసినందు వల్ల దానికి మైసూరుపాక్ అనే పేరును పెట్టారని వివరించారు. దీనికి వేరే పేరు అక్కర్లేదని, అర్ధాలు మారిపోయేలా పేర్లు మార్చొద్దని డిమాండ్ చేశారు. కాగా, మైసూర్ వడయార్ రాజకుటుంబానికి ఈ కకాసుర వంటవాడిగా ఉండేవారు. ఈ స్వీట్‌ను తొలుత తయారు చేసిన క్రెడిట్ ఆయనకే దక్కింది.
దీనిపై ఆ దుకాణం యజమాని అంజలీ జైన్ మాట్లాడుతూ దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లో ఉంటే సరిపోదని, ప్రతి పౌరుడికి దేశంపై ప్రేమ ఉండాలన్నారు. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ ఈ పదానికి పాకిస్థాన్‌తో సంబంధం లేకపోయినప్పటికీ.. దాన్ని పలికే శబ్దం ఆ దేశాన్ని గుర్తుచేసేలా ఉండటంతోనే పేరు మార్చినట్లు అంజలీ జైన్ తెలిపారు. శ్రీ అనే పదం శుభానికి సూచికగా పెట్టినట్లు పేర్కొన్నారు. ఆమె మైసూరుపాక్‌తో పాటు మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్, స్వర్ణ భాషం పాక్, చాందీ భాషమ్ పాక్‌ల పేర్లను కూడా మార్చేశారు. వాటి పేర్లలోని పాక్ అనే పదం స్థానంలో శ్రీని చేర్చారు.






