- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Madras High Court: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర భాష తెలియకపోతే ఎలా?
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు తప్పనిసరిగా వారు తమిళం చదవడం, రాయడం నేర్చుకోవాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు తప్పనిసరిగా వారు తమిళం చదవడం, రాయడం నేర్చుకోవాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ పేర్కొంది. తమిళ భాషలో నిర్వహించిన పరీక్షలో తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB)లో జూనియర్ అసిస్టెంట్ ఎం జైకుమార్ ఫెయిల్ అయ్యాడు. దీంతో, అతడ్ని ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయంపైనే అతను హైకోర్టుని ఆశ్రయించాడు. తన తండ్రి నావికా సేవలో ఉన్నందున తాను సీబీఎస్ఈ పాఠశాలల్లో చదివానని.. అందుకే తమిళ నేర్చుకోలేదని కోర్టుకు చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగి తమిళం తెలియకుండా ఎలా పని చేయగలరని ప్రశ్నించింది. “ప్రభుత్వ ఉద్యోగులకు తమిళం తెలియకపోతే ఏమి చేయగలరు? వారు రోజువారీ పనులను ఎలా నిర్వహిస్తారు? ఏ రాష్ట్రంలోనైనా, ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర భాష తెలుసుకోవాలి. లేకపోతే, ఏమి చేయగలరు?” అని ధర్మాసనం ప్రశ్నించింది.
కేసు వాయిదా
అంతేకాకుండా, అభ్యర్థులు నిర్ణీత సమయంలోపు ప్రభుత్వ భాషా పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని కోర్టు నొక్కిచెప్పింది. తుది వాదనకు సిద్ధంగా ఉండాలని ఇరు పక్షాలను ఆదేశించింది. కేసును ఆరు వారాల పాటు వాయిదా వేసింది. తమిళనాడులో భాషా యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో ఈ తీర్పు వెలువడడం సంచలనంగా మారింది. అంతేకాకుండా, తమిళనాడు సీఎం స్టాలిన్ ఎంఈపీకి వ్యతిరేకంగా కేంద్రంపై పోరాటానికి రెడీ అయ్యారు.






