- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: రాజకీయాలు, బంధుప్రీతి వద్దు.. ప్లీడర్లు, పీపీ నియామకాలపై సుప్రీం కోర్టు
రాజకీయాలు, బంధుప్రీతి వద్దు.. ప్లీడర్లు, పీపీ నియామకాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో : గవర్నమెంట్ ప్లీడర్లు (Govt Pleaders), పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (Public Prosecutors) నియామకం రాజకీయాలు (Political Considerations), బంధుప్రీతి (Nepotism) ప్రాతిపదికన కాకుండా కచ్చితంగా మెరిట్ ఆధారంగా ఉండాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. న్యాయమైన విచారణలు, న్యాయ వ్యవస్థ సమగ్రతను నిర్ధారించడంలో ఈ స్థానాలు కీలక పాత్ర పోషిస్తాయని అందువల్ల వీటి నియామకాల విషయంలో నిష్పక్షపాత ధోరణితో ఉండాలని జస్టిస్ జేబీ.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. వృత్తిపరమైన అర్హతల కంటే బాహ్య కారకాలపై ఆధారపడిన నియామకాలు న్యాయవ్యవస్థ పునాదిపైనే రాజీ పడవచ్చని అభిప్రాయపడింది. ఈ తీర్పు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సందేశం అని సంబంధిత హైకోర్టులలో ఏజీపీ, ఏపీపీలను వారి మెరిట్ ఆధారంగా మాత్రమే నియమించాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది.






