Elon Musk: ట్రంప్ గెలుపు కోసం రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన ఎలన్ మస్క్

by S Gopi |   ( Updated:2024-12-06 18:25:49.0  )
Elon Musk: ట్రంప్ గెలుపు కోసం రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన ఎలన్ మస్క్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచేందుకు ప్రపంచ అత్యంత సంపన్నుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ వేలా కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. తాజా విడుదలైన కొత్త ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ ఫైలింగ్స్ ప్రకారం, ఈ ఏడాది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రచారం చేసేందుకు ఎలన్ మస్క్ ఏకంగా 259 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 2,194 కోట్లు) ఖర్చు చేశారు. భారీ మొత్తం విరాళం ద్వారా అమెరికా చరిత్రలోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి అతిపెద్ద దాతగా నిలిచారు. అంతేకాకుండా ట్రంప్‌నకు శక్తివంతమైన రాజకీయ మిత్రుడిగా, కొత్తగా ఏర్పడే రిపబ్లిక్ పాలనా విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈసారి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం పొలిటికల్ యాక్షన్ కమిటీ(పీఏసీ) ప్రచారాన్ని నిర్వహించింది. ఈ కమిటీకి ఎలన్ మస్క్ 239 మిలియన్ డాలర్లు(రూ. 2 వేల కోట్లు) నగదు రూపంలో ఉచ్చారు. మరికొంత మొత్తాన్ని ఇతర మార్గాల్లో ఖర్చు చేశారు.

Advertisement

Next Story

Most Viewed