- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రెసిడెంట్ ట్రంప్‌తో మస్క్ కయ్యం.. టెస్లా షేర్లు భారీగా పతనం
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కయ్యానికి కాలు దువ్వుతోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కయ్యానికి కాలు దువ్వుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల డోజ్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్ ప్రెసిడెంట్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు ట్రంప్ కూడా మస్క్‌కు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ మార్కెట్‌లో టెస్లాకు చెందిన షేర్లు భారీగా పతనం అయ్యాయి. దాదాపు 152 బిలియన్ డాలర్ల అంటే భారత భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షల కోట్ల సంపద ఒక్కిసారిగా ఆవిరైంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం మేర పడిపోయాయి. అదేవిధంగా టెస్లా కంపెనీ (Tesla Company) మార్కెట్ విలువ 1 ట్రిలియన్ మార్క్‌ను కోల్పోయి 916 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులోనే అంత సంపద కోల్పోవడం టెస్లా చరిత్రలోనే మొదటిసారి అని షేర్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
కాగా, ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తన సపోర్ట్ లేకపోతే ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోయే వారికి కామెంట్ చేశారు. అదేవిధంగా సెక్స్ కుంభకోణంలో నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టైన్ (Jeffrey Epstein)తో ట్రంప్‌కు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది.






