- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిక్కీతో 2020లోనే సాహిల్ పెళ్లి.... పోలీసుల చేతికి కీలక ఆధారాలు
దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిక్కీ యాదవ్ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను... murder: Sahil and Nikki had temple wedding in 2020, cops recover marriage certificate

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిక్కీ యాదవ్ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను చేధించారు. నిక్కీతో సహాజీవనం చేస్తున్నారని భావిస్తున్న పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. సాహిల్ గెహ్లట్ నిక్కీని 2020లోనే ఆర్య సమాజ్ టెంపులో పెళ్లి చేసుకున్నట్లు తేలిందని అధికార వర్గాలు తెలిపారు. వీరిద్దరూ దండలు మార్చుకున్న ఫోటో పోలీసుల చేతికి చిక్కిందని పేర్కొన్నాయి. అంతేకాకుండా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా లభించినట్లు తేలింది. రెండో పెళ్లి కోసమే నిక్కిని హతమార్చినట్లు అంచనా వేస్తున్నారు. పెళ్లి విషయమై నిక్కీకి తెలియడంతో గొడవ జరిగి హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ నెల 10న తన గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేసి సాహిల్ ఫ్రిడ్జిలో దాచాడు. తర్వాత నాలుగు రోజులకు విషయం బయటకు పొక్కిన సంగతి తెలిసిందే. సాహిల్ నిక్కీని పెళ్లి చేసుకోవడం అతని కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోవడంతో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. నిక్కీని వదిలించుకునే క్రమంలో హత్య చేసినట్లు నిర్ధారించారు. దీనికి సహాయపడిన సాహిల్ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






