అడ్డంగా దొరికిపోయిన మహమ్మద్ షమీ మాజీ భార్య.. మర్డర్ అటెంప్ట్ కేసు ఫైల్..

by Sujitha Rachapalli |

ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్‌పై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పొరుగింటి వారిపై దాడి చేసిన కేసులో హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు సమాచారం. వెస్ట్ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని సూరిలో పక్కింటి వారిపై దాడికి

అడ్డంగా దొరికిపోయిన మహమ్మద్ షమీ మాజీ భార్య.. మర్డర్ అటెంప్ట్ కేసు ఫైల్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్‌పై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పొరుగింటి వారిపై దాడి చేసిన కేసులో హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు సమాచారం. వెస్ట్ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని సూరిలో పక్కింటి వారిపై దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదంతా ఆస్తి వివాదం కారణంగా జరిగినట్లు టాక్. ఈ ఘటనలో హసిన్ జహాన్, ఆమె మొదటి భర్తతో కలిగిన కుమార్తె అర్షి జహాన్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద హత్యాయత్నం.. దాడి, ఇతర ఆరోపణలతో కేసు నమోదైనట్లు సమాచారం. కాగా ఈ మధ్యే జహాన్‌కు కలకత్తా హైకోర్టు నాలుగు లక్షల భరణం (ఆమెకు ₹1.5 లక్షలు, వారి కుమార్తెకు ₹2.5 లక్షలు) మంజూరు చేసింది. షమీ ఆర్థిక స్థితిని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశం 2023లో తక్కువ మొత్తం మంజూరు చేసిన లోయర్ కోర్టు ఉత్తర్వును జహాన్ సవాలు చేయడంతో వచ్చింది.

VIDEO

Next Story