- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mumbai: పెహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత ముంబైలో హై అలర్ట్
తీరప్రాంత నిఘాను పెంచడం, స్పిల్‌ఓవర్ ప్రమాదాలను నివారించేందుకు భద్రతా చర్యలను పెంచారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబైతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముంబై చుట్టుపక్కల ఉండే అన్ని బీచ్‌లపై నిఘా పెంచారు. పెహల్‌గామ్ మారణహోమం తర్వాత సముద్రంలో నిఘాను పెంచాలని, బహిరంగ ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేయాలని మహారాష్ట్ర హోం శాఖ ముంబై పోలీసులను ఆదేశించింది. తీరప్రాంత నిఘాను పెంచడం, స్పిల్‌ఓవర్ ప్రమాదాలను నివారించేందుకు భద్రతా చర్యలను పెంచారు. ఓడరేవులు, జెట్టీలు, వాటర్‌ఫ్రంట్ల వద్ద భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. అదనపు పెట్రోలింగ్ యూనిట్లు, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మరోవైపు, న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ సమీపంలో 500 మందికి పైగా సామాన్యులు పెహల్‌గామ్ దాడికి నిరసనగా గుమిగూడారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ, పాక్‌పై ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ తరహాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులు భారీగా భద్రతను పెంచారు. హైకమిషన్ వద్ద 500 మీటర్ల వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. కొందరు నిరసనకారులు బారికేడ్లను దాటుకుని వచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు.






