- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిలిచిపోయిన ముంబై మోనో రైళ్లు
ముంబై వాసుల ప్రధాన రవాణా సదుపాయాల్లో ఒకటైన మోనోరైలు సేవలు మంగళవారం సాయంత్రం అర్థాంతరంగా నిలిచిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్ : ముంబై వాసుల ప్రధాన రవాణా సదుపాయాల్లో ఒకటైన మోనోరైలు సేవలు మంగళవారం సాయంత్రం అర్థాంతరంగా నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా మోనో రైల్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు పేర్కొన్నారు. మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో విద్యుత్ సరఫరా సమస్య వల్ల రైలు గంటకు పైగా నిలిచిపోగా.. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. లోపల గాలి ఆడక, ఏసీలు పనిచేయక సతమతం అయ్యారు. కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం మూడు స్నోర్కెల్ వాహనాల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. కాగా రైలు నిలిచిపోయిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.
మోనోరైలు సేవల్లో తరుచూ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతుండటంతో ఈ సమస్యలను పరిష్కరించేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) 10 కొత్త "మేడ్ ఇన్ ఇండియా" రైళ్లను ఆర్డర్ చేసింది. ఒక రైలు ఇప్పటికే రాగా, టెస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈనెల చివరికి 18 రైళ్లతో మోనోరైళ్ల సేవలను మరింత మెరుగుపరచాలని, రైళ్ల మధ్య విరామాన్ని 15 నిమిషాల నుండి 5 నిమిషాలకు తగ్గించాలని MMRDA లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, మెట్రో లైన్ 3తో జాకబ్ సర్కిల్ వద్ద కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ప్రయాణికుల సంఖ్యను 1.5 లక్షలకు పెంచాలని యోచిస్తోంది.






