Abu Salem : విడుదల తేదీని చెప్పాలంటూ అబూ సలెం పిటిషన్‌‌.. తిరస్కరించిన కోర్టు

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : తనను ఎప్పటికల్లా జైలు నుంచి విడుదల చేస్తారో మహారాష్ట్ర జైలు అధికారులు చెప్పాలంటూ గ్యాంగ్‌స్టర్ అబూ సలెం(Abu Salem) దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని స్పెషల్ కోర్టు(Mumbai court) తిరస్కరించింది.

Abu Salem : విడుదల తేదీని చెప్పాలంటూ అబూ సలెం పిటిషన్‌‌..  తిరస్కరించిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : తనను ఎప్పటికల్లా జైలు నుంచి విడుదల చేస్తారో మహారాష్ట్ర జైలు అధికారులు చెప్పాలంటూ గ్యాంగ్‌స్టర్ అబూ సలెం(Abu Salem) దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని స్పెషల్ కోర్టు(Mumbai court) తిరస్కరించింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసు, ఒక బిల్డర్‌ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న అబూ సలెంకు ఇలాంటి సమాచారాన్ని ముందస్తుగా ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

‘‘అబూ సలెంకు 25 ఏళ్లలోపు జైలు శిక్షనే విధించాలి.. మరణశిక్షను విధించకూడదు అనే షరతులతో పోర్చుగల్‌ దేశంతో ఒప్పందం కుదుర్చుకొని భారత్‌కు తీసుకొచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం కనీసం 25 ఏళ్ల జీవితఖైదు శిక్షను అతడు పూర్తిగా అనుభవించాల్సిందే’’ అని కోర్టు తేల్చి చెప్పింది. ఈ శిక్ష అమలు విషయంలో అతడికి ఇంకా మినహాయింపులను, సడలింపులను మంజూరు చేసే ప్రసక్తే లేదని వెల్లడించింది.

Next Story