సెక్స్ వీడియోతో బ్లాక్ మెయిల్.. ఇప్పటికే మూడు కోట్లు లాగిన కిలాడీ లేడీ.. ఇంటికొచ్చి కొట్టింది.. భరించలేని యువకుడు

by Sujitha Rachapalli |

ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఓ అమ్మాయి టార్చర్ భరించలేని సీఏ రాజ్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దీనికి ముందు మూడు పేజీల ఆత్మహత్య లేఖ రాసి.. సబా ఖురేషి, రాహుల్ పర్వాని తన చావుకు కారణమని స్పష్టం చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే..

సెక్స్ వీడియోతో బ్లాక్ మెయిల్.. ఇప్పటికే మూడు కోట్లు లాగిన కిలాడీ లేడీ.. ఇంటికొచ్చి కొట్టింది.. భరించలేని యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఓ అమ్మాయి టార్చర్ భరించలేని సీఏ రాజ్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దీనికి ముందు మూడు పేజీల ఆత్మహత్య లేఖ రాసి.. సబా ఖురేషి, రాహుల్ పర్వాని తన చావుకు కారణమని స్పష్టం చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. సబా ఖురేషి అనే అమ్మాయిని సోషల్ మీడియా ద్వారా కలిశాడు రాజ్. ఆ తర్వాత క్లోజ్ అయిన ఇద్దరు శారీరక సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నారు. అయితే సెక్స్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ మూమెంట్స్‌ను వీడియోలు తీసింది సబా. ఇందుకు తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ హెల్ప్ తీసుకుంది.

ఆ తర్వాత తను అడిగినంత డబ్బు ఇవ్వలేదంటే ప్రైవేట్ వీడియో లీక్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో దాదాపు మూడు కోట్లు లాగింది. దీంతో ఒత్తిడికి లోనైన రాజ్.. ఇక ఇదంతా వద్దని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆమెకు రెస్పాండ్ కాలేదు. దీంతో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఇంటికొచ్చి తల్లి ముందే కొట్టింది సబా. ఈ అవమానాన్ని భరించలేని రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం సబా, రాహుల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TWEET

Next Story