Mumbai: ముంబైలో పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు మృతి

by B.Srinivas |

మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ప్రజల పైకి దూసుకెళ్లింది.

Mumbai: ముంబైలో పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర(Maharashtra)లోని ముంబై(Mumbai)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ప్రజల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్లా (kurla) నుంచి అంధేరి(Andheri)కి వెళ్తున్న బృహన్‌ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు నగరంలోని అంబేద్కర్ నగర్ (Ambedhkar nagar) ప్రాంతంలో ఒక్కసారిగా అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. బస్సు మొదట ప్రజలపైకి వేగంగా దూసుకెళ్లి ఆ తర్వాత అక్కడే ఆగి ఉన్న కొన్ని వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే బస్సు బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.

Next Story