ఆ ఆలయానికి ముకేష్ అంబానీ రూ.5 కోట్ల విరాళం

by velandi.Saikiran |

సోమనాథ్ ఆలయానికి ముకేష్ అంబానీ రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని ముకేష్ అంబానీ దంపతులు శుక్ర‌వారం సందర్శించారు.

ఆ ఆలయానికి ముకేష్ అంబానీ రూ.5 కోట్ల విరాళం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియాలోనే అత్యంత ధ‌నికుడు ముకేష్ అంబానీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సోమనాథ్ ఆలయానికి ముకేష్ అంబానీ రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని ముకేష్ అంబానీ దంపతులు శుక్ర‌వారం సందర్శించారు. సతీమణి నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఆలయానికి ముకేష్ అంబానీ రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఆల‌య క‌మిటీ ప్ర‌క‌టించింది. అటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ అంబానీ ఫ్యామిలీ ఆలయాన్ని చేరుకుంది. అంబానీ ఫ్యామిలీ ప్రతి సంవత్సరం ఆరంభంలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే. కిందటి ఏడాది కూడా వాళ్లు ఈ సోమనాథుడిని ద‌ర్శించుకున్నారు.

Next Story