- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Muda scam: ముడా కేసులో సిద్ధరామయ్య భార్యకు ఊరట.. ఈడీ సమన్లను రద్దు చేసిన హైకోర్టు
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామ్య భార్య పార్వతికి ఊరట లభించింది.

దిశ, నేషనల్ బ్యూరో: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Muda) భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) భార్య పార్వతికి (Parvathi) ఊరట లభించింది. ఈ కేసులో విచారణ నిమిత్తం పార్వతికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జారీ చేసిన సమన్లను కర్ణాటక హైకోర్టు (Karnataka High court) రద్దు చేసింది. అంతేగాక రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి బైరతి సురేష్ (Byrathi suresh)లకు పంపిన నోటీసులను సైతం జస్టిస్ నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొ్ంటున్న పార్వతికి ఊరట లభించినట్టు అయింది. జనవరి 3, 28 తేదీల్లో విచారణకు రావాలని పార్వతికి ఈడీ రెండు సార్లు సమన్లు జారీ చేసింది.
అయితే ఇన్వెస్టిగేషన్‌కు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం సమన్లపై మధ్యంతర స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా విచారణ చేపట్టిన కోర్టు సమన్లను రద్దు చేసింది. కాగా, ముడా కేసు కర్ణాటకలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గతంలో సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త నుంచి క్లీన్ చిట్ లభించింది. సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి సహా నలుగురు నిందితులపై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు తెలిపారు. దీంతో తాజాగా హైకోర్టు తీర్పుతో సిద్ధరామయ్యకు భారీ ఉపశమనం లభించింది.






