Muda case: ముడా కేసులో సిద్ధరామయ్యకు షాక్.. దర్యాప్తు కొనసాగించాలని స్పెషల్ కోర్టు ఆదేశాలు

by B.Srinivas |

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది.

Muda case: ముడా కేసులో సిద్ధరామయ్యకు షాక్.. దర్యాప్తు కొనసాగించాలని స్పెషల్ కోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Muda) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు (Siddaramaiah) షాక్ తగిలింది. ఈ కేసులో లోకాయుక్త (Lokayuktha) పోలీసుల దర్యాప్తు కొనసాగించాలని బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తుది నివేదికను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. ముడా కేసులో లోకాయుక్త పోలీసుల క్లీన్ చిట్ నివేదికను సవాల్ చేస్తూ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టి ఈ ఆర్డర్స్ జారీ చేసింది.

పోలీసులు దర్యాప్తు పూర్తి చేయాలని, అప్పటి వరకు బీ రిపోర్ట్‌పై ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోమని న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. అలాగే కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన ‘బి రిపోర్ట్’ కు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. కాగా, ముడా కేసులో కర్ణాటక సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి సహా ఇతరులపై ఎటువంటి ఆధారాలు లేవని లోకాయుక్త అంతకుముందు తన నివేదికలో పేర్కొంది.

Next Story