- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రికెట్ మ్యాచ్ మధ్యలో కండోమ్ యాడ్.. బీసీసీఐ సమాధానం చెప్పాలంటూ ఎంపీ ఫైర్
భారత్-ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్‌లో కండోమ్ ప్రకటనలపై టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ మండిపడ్డారు. బీసీసీఐ సమాధానం చెప్పాలని, లేకుంటే పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం మధ్యలో కండోమ్ ప్రకటనలను ప్రసారం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లైవ్ బ్రాడ్ కాస్ట్ మధ్యలో కండోమ్ ప్రకటనలను ప్రసారం చేశారని ఇలాంటి అడల్ట్ ప్రకటనలను మ్యాచ్ మధ్యలో చూపించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో బీసీసీఐ స్పష్టత ఇవ్వాలని లేకపోతే ఈ అంశాన్ని తాను పార్లమెంట్ సమావేశంలో లేవనెత్తుతానన్నారు.
వాటిపై నిషేధం.. వీటిపై లేదా?
1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్, 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా, ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఈ దేశంలో క్రికెట్‌ను ఒక మతంగా భావిస్తారు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్‌ను తాను చూస్తున్న సమయంలో దాదాపు 44 కోట్ల మంది ప్రేక్షకులు లైవ్ చూస్తున్నారు. అందులో 16 ఏళ్లలోపు పిల్లలు, యువకులే ఎక్కువ ఉంటారు. కోట్లాది మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి మ్యాచ్ చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా కండోమ్‍కు సంబంధించిన అడల్ట్ ప్రకటన స్క్రీన్‌పైకి రావడం నిజంగా సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి యాడ్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎటు చూడాలో తెలియక ఇబ్బంది పడుతుంటే, పిల్లలు అవేంటో అర్థం కాక ప్రశ్నిస్తున్నారని ఇది వారి మనసులపై ఎలాంటి ప్రభావం చూపుతుందని నిలదీశారు. అల్కహాల్, సిగరెట్ ప్రకటనలపై నిషేధం ఉన్నప్పుడు, ఇలాంటి అడల్ట్ ప్రకటనలను ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెంటనే దృష్టి సారించి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.






