- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక్‌సభలోకి డీప్‌ఫేక్ నియంత్రణ బిల్లు.. ప్రవేశపెట్టిన ఎంపీ శ్రీకాంత్ షిండే
దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో డీప్‌ఫేక్ (Deep Fake) వీడియోల కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ఇవాళ లోక్‌సభలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే (MP Srikanth Shinde) ప్రవేశపెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో డీప్‌ఫేక్ (Deep Fake) వీడియోల కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ఇవాళ లోక్‌సభలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే (MP Srikanth Shinde) ప్రవేశపెట్టారు. ఒకవేళ బిల్లు పాస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో డీప్‌ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట పడనుంది. అయితే, ఈ బిల్లులో సంచలన విషయాలను పొందుపరిచారు. ఎవరి ఇమేజ్ లేదా వాయిస్‌ను డీప్‌ఫేక్‌కు ఉపయోగించినా వారి ముందస్తు అనుమతి తప్పనిసరి అనే పేర్కొన్నారు. హానికర ఉద్దేశంతో డీప్‌ఫేక్‌లను తయారు చేసినా, షేర్ చేసినా కఠిన శిక్షలు విధించనున్నట్లుగా పేర్కొన్నారు. డీప్‌ఫేక్ బెదిరింపులను అంచనా వేయడానికి, గుర్తించే టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి డీప్‌ఫేక్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. డీప్‌ఫేక్ గుర్తింపు పరిశోధనలకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక డీప్‌ఫేక్ ఫండ్ సృష్టించనున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్‌ఫేక్ టెక్నాలజీ మీడియా మార్ఫింగ్‌కు ఓ ఆయుధంగా మారిందన్నారు. విద్య, వినోదం, సృజనాత్మకతలో దీనికి మంచి అవకాశాలున్నా.. దుర్వినియోగం జరిగితే వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రత, ప్రజల నమ్మకం తీవ్రంగా దెబ్బతింటాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ బిల్లుతో డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలకు అడ్డుకట్టపడే అవకాశం వంద శాతం ఉందన్నారు. కాగా, ప్రైవేట్ మెంబర్ బిల్లు (Private Member Bill) అయినప్పటికీ, దీనిపై సభలో విస్తృతంగా చర్చ జరిగి చట్టంగా మారే అవకాశం తక్కువే అయినా.. డీప్‌ఫేక్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టం తీసుకొచ్చేలా ఒత్తిడి పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






