- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్మోహన్ సింగ్‌ను చూసి మానవత్వం అంటే ఏంటో నేర్చుకోండి.. పార్లమెంట్‌లో ఎంపీ ఎమోషనల్ స్పీచ్
26/11 ముంబాయి ఎటాక్ జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారని డీఎంకే ఎంపీ కనిమొంజి కరుణానిధి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: 26/11 ముంబాయి ఎటాక్ జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారని డీఎంకే ఎంపీ కనిమొంజి కరుణానిధి అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రజలను కాపాడలేకపోయామని.. ఎటాక్ జరగకుండా ఉండాల్సిందని మన్మోహన్ సింగ్ దేశ ప్రజలకు స్వారీ చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన మన మధ్యన లేరని, ఆయనను చూసి కొంచెం మానవత్వం నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు.
పహల్గామ్ దాడికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక పర్యాటకులు ఈ ఘటనలో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు మిమ్మల్ని నమ్ముకుని టూర్ కు వచ్చారని, కానీ మీరు వాళ్లని కాపాడుకోలేకపోయారని మండిపడ్డారు. పహల్గామ్ బాధితులకు మీరు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు కేంద్రం ఏం ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలన్నారని మండిపడ్డారు.






