MP Elections 2024 : సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం

by Disha Web Desk 4 |
MP Elections 2024 : సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం అయింది. తొలిదశలో 17 రాష్ట్రాలు, 4 యూటీల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలిదశ లోక్‌సభ ఎన్నికల బరిలో 1,652 మంది అభ్యర్థులు ఉన్నారు. నేడు 16.63 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో తొలిదశ పోలింగ్ కొనసాగనుంది. తమిళనాడులోని అన్ని స్థానాలకు తొలిదశలోనే పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 50, సిక్కిలోని 32 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో 60 స్థానాలకు గాను 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం అయింది. 8 మంది కేంద్ర మంత్రుల భవితవ్యాన్ని తొలిదశలో ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా జరిగేలా ఈసీ అన్ని చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సగానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు చేశారు. తొలిదశ పోలింగ్ కోసం 361 మంది పరిశీలకులను ఈసీ నియమించింది. 5వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా అధికారులకు విధులు నిర్వహించే బాధ్యతలు అప్పగించారు.

Next Story

Most Viewed