- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు జరిగే బీసీ ధర్నాకు కవిత వస్తానంటే ఆహ్వానిస్తున్నాం: ఎంపీ చామల
ఓటర్ల నమోదు పేరుతో బీహార్ లో ఓ కార్యక్రమం చేపట్టి చాలా మంది ఓటర్లను డిలీట్ చేసే కుట్ర చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఓటర్ల నమోదు పేరుతో బీహార్ లో ఓ కార్యక్రమం చేపట్టి చాలా మంది ఓటర్లను డిలీట్ చేసే కుట్ర చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ఎలక్షన్ కమిషన్ ను తమ సొంత కార్యకర్తలా వాడుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దానిని ఆపేందుకు వారం రోజుల నుండి తీవ్రమైన కార్యక్రమాలు చేపడుతున్నామని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆ అంశం చర్చకు రాకముందే హౌస్ అర్జెన్ అయ్యిందన్నారు.
కాబట్టి రేపు చర్చకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 24న బీసీ రిజర్వేషన్లపై కార్యక్రమాలు మొదలు పెట్టామని అప్పుడు కవిత ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని అన్నారు. రాజకీయ లబ్ది కోసం, రాజకీయాల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉందనే ఓబీసీ అనే అంశంతో కవిత ప్రజల్లో నాయకురాలిగా ఎదగాలని అనుకుంటుందన్నారు. ఢిల్లీలో పార్టీలకు అతీతంగా 42 శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతున్నామని, కార్యక్రమానికి కవిత వస్తానంటే ఆహ్వానిస్తున్నామని చెప్పారు.






