- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP బోర్డ్ 10వ, 12వ తరగతి ఫలితాలు విడుదల.. టాపర్స్ గా ఎవరంటే?
మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10,12 తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (MPBSE) 10వ తరగతి (హైస్కూల్),12వ తరగతి (హయ్యర్ సెకండరీ) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బుధవారం ఉదయం ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లైన mpbse.nic.in, mpbse.mponline.gov.in, mpresults.nic.in లలో చూసుకొని మార్క్స్ లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కాగా వీరిలో సుమారు 9.07 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు, దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి బోర్డు పరీక్షలు రాశారు. 12వ తరగతిలో మొత్తం ఉత్తీర్ణత శాతం 76.01 శాతం కాగా ఇది గత 16 సంవత్సరాలలో అత్యధికం అని అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 72.39 శాతం బాలురు,79.41 శాతం బాలికలు ఉన్నారు. ఇక 10వ తరగతిలో మొత్తం ఉత్తీర్ణత శాతం 73.4 శాతంగా ఉంది. వీరిలో 70.31 శాతం మంది బాలురు,77.52 శాతం మంది బాలికలు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
టాపర్స్ వీరే:
MP బోర్డ్ 12 ఫలితాల్లో టాపర్ గా భోపాల్‌కు చెందిన కామర్స్ విద్యార్థిని కుమారి ఖుషీ రాయ్ లిలిచారు. భోపాల్‌కు చెందిన చాందిని విశ్వకర్మ కూడా సంయుక్తంగా ప్రథమ స్థానం పొందారు. ఈ ఇద్దరు విద్యార్థినులు 594 మార్కులు సాధించారు. ఇక 10వ తరగతి పరీక్షలో పన్నాలోని సరస్వతి జ్ఞాన మందిర్‌కు చెందిన కుమారి ప్రతిభ ప్రథమ స్థానం సాధించింది. ఆమె 500 మార్కులకు 499 మార్కులు సాధించింది.
సప్లిమెంటరీ పరీక్షలపై అప్‍డేట్:
పదో తరగతిలో ఫెయిల్ అయిన వారికి, 12 వ తరగతిలో ఫెయిల్ అయిన వారు మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఫలితాలు విడుదలైన 7 రోజుల్లోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.






