- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్–పాక్ మ్యాచ్‌పై ఫైర్ అయిన అసదుద్దీన్ ఒవైసీ
ఆసియా కప్ 2025లో భాగంగా భారత్–పాకిస్తాన్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి జరగబోయే మ్యాచ్‌పై ఉత్కంఠ పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్–పాకిస్తాన్ (India–Pakistan) జట్ల మధ్య ఈ రోజు రాత్రి జరగబోయే మ్యాచ్‌పై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ మ్యాచ్ నిర్వాహణపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, ఇరు జట్లు మాత్రం ఆడకూడదని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఫలితంగా అభిమానులు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ (High-voltage match) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాజీ క్రికెటర్లు కూడా దీనిపై స్పందిస్తూ, “అంతర్జాతీయ టోర్నమెంట్లలో మ్యాచ్‌లు తప్పనిసరిగా ఆడాలి. లేకపోతే జట్లను మొత్తం సిరీస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది” అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఈ రోజు రాత్రి భారత్–పాక్ మ్యాచ్ (India-Pakistan match) జరుగుతుందని ఎక్కువ మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యర్థి దేశంతో క్రికెట్ ఆడటాన్ని ప్రశ్నిస్తూ, “పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరుల ప్రాణాలు పోయాయి. ఆ ప్రాణాల కంటే ఒక మ్యాచ్ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలు ముఖ్యమా?” అని BJPని నిలదీశారు. “పహల్గామ్‌లో మన పౌరులను మతం అడిగి హతమార్చిన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడకూడదని చెప్పే శక్తి మీకు లేదా?” అని ఆయన మీడియాతో ప్రశ్నించారు. ఇక సోషల్ మీడియాలో కూడా భారత్–పాక్ మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. నిన్నటి నుంచి #BoycottPakistanMatch హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా, యువత భారీ స్థాయిలో ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నారు.






