- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఈవో ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. షాక్‌కు గురైన విజిలెన్స్ అధికారులు
డబ్బు ఎంతుందో లెక్కించడానికి స్థానిక బ్యాంకు నుంచి మనీ కౌంటింగ్ మెషీన్‌ను తెప్పించారు.

- రూ.1.87 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
- బీహార్‌లో దొరికిన అవినీతి అధికారి
దిశ, నేషనల్ బ్యూరో:
బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో ఓ డీఈవో ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించగా కొట్టల కొద్దీ డబ్బు బయటపడింది. బీహార్ పోలీసులకు చెందిన యాంటీ కరప్షన్ వింగ్ అయిన స్పెషల్ విజిలెన్స్ యూనిట్ (ఎస్వీయూ) గురువారం బెట్టయ్యాలో ఉన్న డీఈవో రజనీకాంత్ ప్రవీణ్ కార్యాలయం, ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా డీఈవో ఇంట్లోని బెడ్లు, సోఫాల కింద కట్టల కొద్దీ డబ్బు బయటపడింది. ఆ ఇంట్లో ఉన్న ప్రతీ బెడ్ కింద నోట్ల కట్టలు దొరికినట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు. డబ్బు ఎంతుందో లెక్కించడానికి స్థానిక బ్యాంకు నుంచి మనీ కౌంటింగ్ మెషీన్‌ను తెప్పించారు. బీహార్‌లోని విద్యాశాఖతో పాటు ఇతర అధికారులు అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో దర్భంగా, మధుబని, వెస్ట్ చంపారన్, సమిస్థిపూర్ జిల్లాల్లో ఎస్వీయూ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే డీఈవో రజనీకాంత్ ప్రవీణ్ అద్దెకు ఉంటున్న ఇంట్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఇవే కాకుండా ఆయన స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.87 కోట్ల మేర ఉంటుందని తెలుస్తోంది. కాగా పట్టుబడిన నోట్ల కట్టలను ఇంకా లెక్కిస్తుండటంతో మొత్తం ఎంత డబ్బు ఉందో తర్వాత వెల్లడిస్తామని విజిలెన్స్ అధికారులు చెప్పారు.
సదరు డీఈవో భార్య బెట్టియాలో ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర విద్యాశాఖలో 2005లో జాయిన్ అయిన ప్రవీణ్.. గత మూడేళ్లుగా బెట్టియా డీఈవోగా పని చేస్తున్నారు. బీహార్ విద్యా శాఖలోని 10 మంది అధికారులపై విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. వీరిలో రజనీకాంత్ ప్రవీణ్ ఒకరు. కాగా, బీహార్ విద్యా శాఖ అదరపు ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్ధార్థ్ ఈ అంశంలో విచారణకు ఆదేశించారు.






