కారులో కొబ్బరి బొండాలో చిన్నారితో మూత్రవిసర్జన.. రోడ్డుపై పారేసిన తల్లి, నెట్టింట వైరల్

by Ramesh Naini |

కనీస సామాజిక బాధ్యతను గాలికొదిలేసిన ఓ జంట నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

కారులో కొబ్బరి బొండాలో చిన్నారితో మూత్రవిసర్జన.. రోడ్డుపై పారేసిన తల్లి, నెట్టింట వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కనీస సామాజిక బాధ్యతను గాలికొదిలేసిన ఓ జంట నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వైరల్ వీడియో ప్రకారం..కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తల్లి తన కుమారుడితో ఖాళీ కొబ్బరి బోండాలో మూత్రవిసర్జన చేయించింది. అనంతరం ఆ చిప్పను ఏమాత్రం సంకోచం లేకుండా బయట రోడ్డుపైకి విసిరేసింది. డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి (తండ్రి) ఈ తతంగాన్ని గర్వంగా వీడియో తీయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఎన్‌సీఐబీ ఆవేదన..

నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) ఈ వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో షేర్ చేస్తూ.. ప్రజల పౌర బాధ్యత (Civic sense)పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అసహ్యకరమైన పనులను ఏమాత్రం తప్పుకాదన్నట్లుగా, పైగా ఎంతో గర్వకారణం అన్నట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుందని ప్రశ్నించింది.

కఠిన చర్యలకు డిమాండ్

వేలాది మంది వీక్షించిన ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. తల్లిదండ్రుల తీరును ‘అతి దారుణం’, ‘సిగ్గుచేటు’ అంటూ విమర్శిస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, రహదారులపై సరైన మరుగుదొడ్ల సదుపాయాలు, వాటి నిర్వహణ లేకపోవడాన్ని మరి కొందరు నెటిజన్లు ఎత్తిచూపుతూ, ముందు ఆ మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచిస్తున్నారు.

Next Story