ఢిల్లీ బాంబ్‌బ్లాస్ట్‌లో మదర్ ఆఫ్ సైతాన్.. అసలేంటి ఈ TATP?

by Naga Rani Yarlagadda |

దేశాన్ని షేక్ చేసిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో తాజాగా మరో విస్తుపోయే విషయం తెలిసింది.

ఢిల్లీ బాంబ్‌బ్లాస్ట్‌లో మదర్ ఆఫ్ సైతాన్.. అసలేంటి ఈ TATP?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశాన్ని షేక్ చేసిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో తాజాగా మరో విస్తుపోయే విషయం తెలిసింది. ఈ కుట్ర వెనుక ఎక్కువ మంది డాక్టర్లే ఉండగా.. వారికున్న సైన్స్ నాలెడ్జ్ లో బాంబుల తయారీపైనే ఎక్కువ వాడినట్లుగా తెలుస్తోంది. వేల కిలోల పేలుడు పదార్థాలను పోగుచేసి అమాయకుల ప్రాణాలను బలిగొనేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం మదర్ ఆఫ్ సైతాన్ గా పిలిచే TATPని వాడేందుకు రెడీ అయ్యారు. ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ లో కూడా ఈ సైతాన్ ను వాడినట్లుగా ఫోరెన్సిక్ రిపోర్టులు చెబుతున్నాయి. i20కారును బ్లాస్ట్ చేసేందుకు ఉగ్రడాక్టర్ ఉమర్ నబీ ఈ డేంజరస్ కెమికల్ ను వాడినట్లు ఫోరెన్సిక్ టీమ్స్ నిర్ధారించాయి.

ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్ (TATP) ఆనవాళ్లు ఫోరెన్సిక్ టెస్టుల్లో బయటపడ్డాయి. TATPని అమ్మోనియం నైట్రేట్ తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయగా.. ఫరీదాబాద్ లో దర్యాప్తు బృందాలు దానిని స్వాధీనం చేసుకున్నాయి. ఢిల్లీ బ్లాస్ లోనూ ఈ మిక్సింగ్ కారణంగానే బ్లాస్ట్ జరిగినట్లు రిపోర్ట్ చెబుతోంది. జమ్మూకశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లోనూ ఈ కెమికల్ రియాక్షన్ వల్లే భారీ పేలుడు జరిగి 9 మంది చనిపోగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రపంచ వ్యాప్తంగా TATPతో జరిపిన బ్లాస్ట్స్‌

ప్రపంచ వ్యాప్తంగా TATPతో జరిపిన బ్లాస్ట్స్‌ను పరిశీలిస్తే.. 2001 డిసెంబర్‌లో అమెరికాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 63 మంది చనిపోయారు. 2005 జులైలో లండన్లో జరిగిన సూసైడ్ బాంబ్‌బ్లాస్ట్‌లో 52 మంది, 2015 నవంబర్లో పారిస్‌లో జరిగిన వరుస పేలుళ్లలో 130 మంది, 2016 మార్చిలో బ్రస్సెల్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 32 మంది మరణించారు. 2017 మే నెలలో మాంచెస్టర్‌లో బాంబింగ్‌లో 22 మంది మరణించారు.

Next Story